హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): న్యాయ వివాదాలను మధ్యవర్తిత్వంతోనే సత్వరం పరిష్కరించవచ్చని జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్ అన్నారు. న్యాయ ప్రక్రియ మానవీయతతో కూడినదై ఉండాలని పేర్కొన్నారు. హైదరాబాద్ శివారుల్లోని శామీర్‌పేటలో శనివారం జరిగిన నల్సార్ యూనివర్సిటీ 20వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. న్యాయ వివాదాల పరిష్కారానికి నిరంతరం అధ్యయనంతోపాటు అనుభవా ల మేళవింపు ఉండాలని చెప్పారు. ఇందుకు సోక్రటిక్ పద్ధతి ఉత్తమమైనదని అభిప్రాయపడ్డారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఒక ప్రశ్నకు విద్యార్థుల నుంచి వేర్వేరు జవాబులు రాబట్టి వాటిని క్రోడీకరించటం సోక్రటిక్ పద్ధతి అని వివరించారు. రెచ్చగొట్టే రాజకీయ ప్రసంగాలు సోక్రటిక్ విధానం కాదని అన్నారు. ఇందులో భాగంగానే మధ్యవర్తిత్వ విధానం కీలకభూమిక పోషించగలదని చెప్పారు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా వివాదాన్ని పరిష్కరించేందుకు మీడియేషన్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
న్యాయవాద వృత్తి సామాజిక బాధ్యత అనే విషయాన్ని విస్మరించకూడదని జస్టిస్ సంజయ్ కౌల్ ఉద్బోధించారు. ఇందుకు అంబేద్కర్ రూపొందించిన గొప్ప రాజ్యాంగ విధానం దోహదపడుతుందని చెప్పారు. మానవ వ్యత్యాసాలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం చెప్పడమే న్యాయవ్యవస్థ ముందున్న విధి అన్నారు. న్యాయ విద్యాబోధన అనేక కొత్త పుంతలు తొక్కుతున్నదని చెప్పారు. ఇప్పడు కేస్ స్టడీలు, కోర్టుల్లో జరిగే కేసుల విచారణ పర్యవేక్షణ వంటి విధానాలు న్యా య విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా నల్సార్ వర్సిటీలో ఉచిత న్యాయ సహాయ కేంద్రా న్ని జస్టిస్ కౌల్ ప్రారంభించారు.
విశ్వవిద్యాలయంలో వివిధ రకాల న్యాయ సహా యం, అవగాహన కల్పించేందుకు ఈ కేం ద్రం దోహదపడనుంది. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ శ్రీ కృష్ణదేవరావు మాట్లాడుతూ.. యూ నివర్సిటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభు త్వ సహకారం మరువలేనిదని చెప్పారు. కార్యక్రమానికి అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నర్సింహ హాజరయ్యారు. నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అధ్యక్షత వహించారు. వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు ప్రగతి నివేదిక సమర్పించారు. వేడుకగా జరిగిన ఊరేగింపునకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే విద్యుల్లతారెడ్డి నాయకత్వం వహించారు. సుమారు 1100 మంది పీజీ, డిప్లొమా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. 58 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు.