హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ‘అయ్యా నేడు బడ్డీకొట్టు పెట్టుకొని మూడేండ్లు అవుతున్నది. అందుకు మా పంచాయతీ మేడమ్ పర్మిషన్ ఇచ్చింది. ఆ డబ్బా కొట్టుతో ఐదుగురు ఆడబిడ్డల్ని సాదుతున్న. ఇప్పుడా డబ్బా తీసేసినరు. నేను ఎట్లా బతకాలి? ఆంధ్రా నుంచి వచ్చిన కుమారి ఆంటీ ఇక్కడ బతకొచ్చుకానీ.. తెలంగాణ వాళ్లం మేము బతకకూడదా సారు? ఆమెకొక న్యా యం మాకో న్యాయమా?’ అని మంగళవారం ప్ర జాభవన్లో జరిగిన ప్రజావాణిలో ఓ మహిళ కన్నీ టి పర్యంతమైంది. న్యాయం చేయాలని అధికా రులను వేడుకున్నది. రెండు వారాలుగా తిరుగు తున్నా అధికారులెవరూ పట్టించుకోలేదని వాపోయింది. ప్రజావాణికి 11 సార్లు వచ్చానని మహబూ బ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూరుకు చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా ప్రజావాణికి రాలేదని, సెక్రటేరియట్‌కు వెళ్లినా కలవనీయటం లేదని వా పోయారు. భూమి సమస్య పరిష్కారానికి 6 నెలలుగా తిరుగు తున్నా పట్టించుకో వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్ కార్డుల కోసం వెళ్తే.. అధికారులు దురుసుగా మాట్లాడుతున్నారని, ప్ర జావాణిని టైంపాస్ కోసం పెట్టామని అంటున్నారని హైదరాబాద్‌కు చెందిన పలువురు మహిళలు వెల్లడించారు. కష్టం చెప్పుకుందామని వెళ్తే.. అరెస్టు చేస్తామని, జుట్టు ఊడేదాక కొడతమని పోలీసులు అంటున్నారని వాపోతున్నారు.
కాగా మహాత్మా జ్యో తిబాపూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వ హించిన ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపా ధ్యక్షుడు చిన్నారెడ్డి దరఖాస్తులను స్వీకరించా రు. మొత్తం 601 దరఖాస్తులు అందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రెవెన్యూకు సంబంధించి 142, పౌరసరఫరాలశాఖకు సంబంధించి 87, మున్సిపల్ శాఖకు సంబంధించి 53, హోంశాఖకు సంబం ధించి 47 దరఖాస్తులు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 52, ఇతర శాఖలకు సంబంధించి 220 దరఖాస్తులు అందినట్టు వివరించాయి. ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీక రించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.