హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్గా జస్టిస్ దేవరాజు నాగార్జునను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపినట్టు తెలిసింది. దీంతో త్వరలోనే ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈఆర్సీ చైర్మన్గా తన్నీరు శ్రీరంగారావుతోపాటు ఇద్దరు సభ్యుల పదవీకాలం ఈ నెల 29తో ముగియనున్నది. అదేరోజు ఈఆర్సీ చైర్మన్గా నాగార్జున బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. వనపర్తి జిల్లాకు చెందిన నాగార్జున జడ్జిగా వివిధ కోర్టుల్లో పనిచేశారు. 2019లో కామారెడ్డి జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు. 2022లో హైకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2023లో మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయి అక్కడే పదవీ విరమణ పొందారు.