హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయవిచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ గురువారం రాష్ట్రానికి రానున్నారు. పది రోజులపాటు ఇకడే ఉండి విచారణ కొనసాగించనున్నారు. జస్టిస్ ఘోష్ ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్రానికి రాగా, చివరగా మే 6 నుంచి 12వరకు రాష్ట్రంలో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.