మహబూబ్నగర్ : జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు సీజన్లో మొదటిసారిగా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. నారాయణపూర్ నుంచి జూరాలకు 61,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తారు. స్పిల్ వే ద్వారా కూడా దిగువనకు 20,760 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,659 క్యూసెక్కుల నీటిని (మొత్తం అవుట్ ఫ్లో 58,564 క్యూసెక్కులు) విడుదల చేస్తున్నారు. జూరాలలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.340 మీటర్లకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.296గా ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు 90 శాతం నిండాయి. దాంతో ఎగువ నుంచి వచ్చి వచ్చిన వరదను వచ్చినట్లుగా జూరాలకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న తరుణంలో జూరాలకు మరింతగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.