గద్వాల, జూన్ 25 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. బుధవారం 92 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా అధికారులు డ్యాం 15 గేట్లను తెరిచారు. దిగువకు 51,779 క్యూసెక్కులను స్పిల్‌వే ద్వారా విడుదల చేశారు. విద్యుదుత్పత్తికి 32,169 క్యూసెక్కులు, ఎత్తిపోతలకు నీటిని విడుదల చేస్తుండగా.. మొత్తం 85,805 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.010 టీఎంసీల నిల్వ ఉన్నాయి.
తుంగభద్ర డ్యాంకుకు ఇన్‌ఫ్లో 24,600 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 197 క్యూసెక్కులుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా ఉండగా.. ఇన్‌ఫ్లో 226 క్యూసెక్కులు ఉన్నది. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు 208 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 355 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.