కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 26: అధికలోడ్ కోసం విద్యుత్ తీగలను మార్చడానికి లంచం డిమాండ్ చేసిన జూనియర్ లైన్‌మన్ శ్రీకాంత్‌గౌడ్ ఏసీబీ వలకు చిక్కాడు. అవినితి నిరోధక శాఖాధికారుల వివరాల ప్రకారం… గచ్చిబౌలి విద్యుత్ డివిజన్ వసంతనగర్ సెక్షన్ పరిధిలోని ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో వినియోగదారుడికి విద్యుత్ వాహనం చార్జింగ్ కోసం అధిక వాట్స్ కలిగిన విద్యుత్ తీగల అవసరం ఏర్పడింది. విద్యుత్ తీగలను మార్చేందుకు లైన్‌మన్ లింగస్వామి, అసిస్టెంట్ లైన్‌మన్ ఏ శ్రీకాంత్‌గౌడ్‌ను సంప్రదించాడు. దీంతో వారు రూ.30వేల లంచం డిమాండ్ చేయగా ఒప్పుకున్నాడు. మరోవైపు వినియోగదారుడు అవినితి నిరోధక శాఖాధికారులను సంప్రదించగా… శుక్రవారం డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏసీబీ బృందం వసంతనగర్‌లోని ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో మాటువేసి… అసిస్టెంట్ లైన్‌మన్ శ్రీకాంత్‌గౌడ్‌కు రూ.11 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.