హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసొసియేషన్ (టీజీజేఎల్‌ఏ)-475 రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి, కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ వీ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జే కురుమూర్తి, కేపీ శోభన్‌బాబు, అసొసియేట్ అధ్యక్షుడిగా ఎల్ దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కే సురేశ్, కోశాధికారిగా ఎన్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎం శ్రీనివాస్‌రెడ్డి, సీహెచ్ రాజేందర్, ఆర్ మల్లారెడ్డి, ఎం పూర్ణచందర్, కే శ్రీనివాస్, కార్యదర్శులుగా బీ సాయిలు, గోవర్ధన్, రాజాగౌడ్, సంగీత, రజియాబేగం, షాహీన్‌బేగం, రజిని, విశాలాక్ష్మిని ఎన్నుకున్నారు.