హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): జూలై మూడో వారం వచ్చినా ఇప్పటికీ తమకు జూన్‌నెల వేతనాలు చెల్లించకపోవడం శోచనీయమని రాష్ట్ర (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పనిభారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీచర్లపై సర్ భారం మోపడం ఎంతవరకు సబబు ప్రశ్నించారు. వెంటనే వేతనాలు చెల్లించాని కోరారు.