బాన్సువాడ, జూలై 29: లంచగొండి అధికారులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హెచ్చరికలు జారీ చేశారు. కొందరు అధికారులు లంచం తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాంటి వా రు తక్షణమే పద్ధతి మార్చుకోవాలని, లేకపో తే చర్యలు తప్పవని సూచించారు. సోమవా రం ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘వర్షాలు సమృద్ధిగా కురువడం, రైతులకు రుణమాఫీ జరుగుతుండటం శుభపరిణామం.
ఇలాంటి శుభ సందర్భంలో జుక్కల్ నియోజకవర్గంలోని కొంతమంది అధికారులు, ప్రధానంగా రెవెన్యూ ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారని తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. ‘ప్రజలకు సేవ చేసేందుకే మీరు జీతం తీసుకుంటున్నారు. జీతం సరిపోకపోతే ఉద్యోగం మానుకుని మీకు డబ్బులు వచ్చే మరో ఉద్యోగం చూసుకోండి. లేకపోతే జుక్కల్ నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్లండి’ అని హెచ్చరించారు.