హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన బీజే మెడికల్ కళాశాలలో విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్ల అసోసియేషన్(టీ-జూడా) సంతాపం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ న్యూటన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యార్థుల మృతికి సంతాపంగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.