హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ తుది ఓటర్ల జాబితాను సీఈవో సుదర్శన్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000 గా ఉన్నట్టు తెలిపారు. సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నట్టు వివరించారు.
తెలంగాణతల్లి ఫ్లైఓవర్‌గా పేరు మార్పు
హైదరాబాద్, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ) : తెలుగుతల్లి ఫ్లైఓవర్ పేరును ప్రభుత్వం తెలంగాణతల్లి ఫ్లైఓవర్‌గా మార్చింది. కొత్త పేరుతో కూడిన బోర్డును ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటుచేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తెలుగుతల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణతల్లి ఫ్లైఓవర్‌గా మార్చుతూ ఈ నెల 24న తీర్మానం చేయగా, ప్రభుత్వం ఆమోదిస్తూ పేరును మార్చింది.