హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ లేదా నవంబర్లో ఉపఎన్నిక జరిగే అవకాశముందని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన బీసీల ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలుచేశాకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు.