కేటీఆర్ దార్శనికత అభినందనీయం.. జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ జిందాల్ ప్రశంస
తెలంగాణ రాష్ట్రం పట్ల మంత్రి కేటీఆర్‌కు ఉన్న ముందుచూపు, దార్శనికత అభినందనీయమని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, ఎండీ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషికి, ఆయనలోని తపనకు గురువారం ముంబైలో తమ ఇద్దరి మధ్య జరిగిన సమావేశం
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం పట్ల మంత్రి కేటీఆర్‌కు ఉన్న ముందుచూపు, దార్శనికత అభినందనీయమని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, ఎండీ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషికి, ఆయనలోని తపనకు గురువారం ముంబైలో తమ ఇద్దరి మధ్య జరిగిన సమావేశం నిదర్శనమని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కేటీఆర్ చురుకుదనం, రాష్ట్రం పట్ల ముందుచూపు ఆయన దార్శనికతకు తార్కాణమని కొనియాడారు. ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్.. జిందాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.
రాజేంద్రప్రసాద్‌కు కేటీఆర్ ప్రశంస
టీవర్క్స్‌లో కొత్త ఉపకరణాలను కనిపెట్టడంలో వరంగల్‌కు చెందిన రాజేంద్రప్రసాద్ అద్భుతమైన పురోగతిని కనబరుస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. వరంగల్‌లో టీవీ మెకానిక్‌గా పనిచేసే రాజేంద్రప్రసాద్ గత సంవత్సరం టీ వర్క్స్‌లో చేరారు. ఇక్కడ ఆయన పాత వస్తువులతో ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశారు. ఇప్పుడు కొత్త వాటిని కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టీ వర్క్స్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్ రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన పురోగతి సాధిస్తున్నారని ప్రశంసించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

