
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం కోసం భక్తుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. నారసింహుడికి తమ వంతుగా అంటూ భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు నగదు, బంగారం స్వామి వారికి సమర్పిస్తున్నారు. తాజాగా జేఎస్ఆర్ సన్ సిటీ అధినేత జడపల్లి నారాయణ గౌడ్ రూ. 50 లక్షల చెక్కును ఈవో గీతకు గురువారం అందజేశారు.