హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఏడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతిలో కూ రుకుపోయిందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ఆరోపించారు. సోమవారం బీజే పీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రులంతా ప్రతి పనికి పైసా వసూలు చేసే కార్యక్రమం లో బిజీ అయ్యారని, సీఎం తమ్ముడు కూడా సచివాలయంలో రాత్రిదాకా మ కాం వేసి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కల్యాణలక్ష్మి చెక్కు కోసం రూ.7,500 ఇచ్చినా రాలేదని బాధితులు ఓ కాంగ్రెస్ నాయకున్ని నిలదీయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
ఇచ్చంపల్లి రిజర్వాయర్‌ను అంగీకరించం
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : గోదావరి, కావేరీ అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అంగీకరించేది లేదని రాష్ట్ర ప్రభు త్వం స్పష్టం చేసింది. సోమవారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ)పాలకమండలి సమావేశం జరిగింది. రాష్ట్రం నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్, అంతర్రాష్ట్ర వ్యవహారాల చీఫ్ ఇంజినీర్ మోహన్‌కుమార్ హాజరయ్యారు. ఇచ్చంపల్లి నుంచి కేవలం 24 కిలోమీటర్ల దిగువనే తుపాకులగూడెం(సమ్మక సాగర్) బరాజ్ ఉందని గుర్తుచేశారు. ఒకవేళ ఇచ్చంపల్లి నుంచి ఆకస్మికంగా వరదను విడుదల చేస్తే బరాజ్ వద్ద నియంత్రించడం కష్టమవుతుందని స్పష్టం చేశారు.
ఎస్‌వోసీలపై 4 వారాల్లో కౌంటర్ వేయండి
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)లపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేందుకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 4 వారాల సమయం ఇచ్చిం ది. కౌంటర్ దాఖలుకు ఇదే చివరి అవకాశమని సోమవారం జరిగిన విచారణలో ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్ కుమార్ స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 28, 29 తేదీలకు వా యిదా వేశారు.