హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు తెలిపి.. కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. గురువారం (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, పెన్షన్ సీంకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పత్రికలకు ప్రభుత్వ గుర్తింపు, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఏ ఒక సమస్యను పరిషరించలేదని విమర్శించారు. ఈ సమావేశంలో ఫెడరేష న్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీ ఆనందం, పి ల్లి రాంచందర్, బండి విజయ్‌కుమా ర్, ఎల్గొయి ప్రభాకర్, గుడిగ రఘు, కొప్పు నిరంజన్, విజయానంద్, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 20: అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్‌రెడ్డిపై నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. 2023 నవంబర్ 26న అనుమతి లేకుండా దాదాపు 300 మందితో నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురంలో రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారని ఫిర్యాదు అందింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా అనుమతి పొందకుండా ర్యాలీ నిర్వహించడం చట్టవిరుద్ధమంటూ అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ నాగం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎఫ్ఐఆర్ను కొట్టేవేస్తూ తీర్పునిచ్చారు.