నిజామాబాద్ : తెలంగాణలో బీజేపీ( BJP ), కాంగ్రెస్( Congress) పార్టీలు కలిసి (Joint Rule) పరిపాలన చేస్తున్నాయని ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ( Bajireddy Goverdhan ) ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సభ్యత నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్టీ నాయకులు సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఓటరు సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం స్నేహపూర్వకంగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి కుటిల రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విట్టల్ రావు, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, తదితరులు పాల్గొన్నారు.