జగిత్యాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ ఎల్.రమణ(MLC L. Ramana), జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం సీనియర్ న్యాయవాది ఎర్ర నరసయ్య, పులి శెట్టి శ్రీనివాస్, పాండురంగ విఠల్ శశిధర్, అనుమల్ల భుజంగం ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తెలంగాణలో ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు. సాగుకు మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు జగిత్యాల పట్టణ 38వ వార్డులో కౌన్సిలర్ దాసరి లావణ్య, ఎలుమద్రి కిశోర్, పోతునుక మహేష్ ఆధ్వర్యంలో పలువరు కాంగ్రెస్,బీజేపీ పార్టీలను వీడి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పోతంశెట్టి సతీష్ రాజ్ శ్రీపాల్ రెడ్డి, భూసారపు శ్రీనివాస్ గౌడ్, చీటీ రామకృష్ణారావు, రామిడి జగన్, చింత శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు..