నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ నియోజకర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా కట్టంగూర్ (మం) కురుమర్తి గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (MLA Chirumurthy )సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు లేదని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని జిమ్ముక్కులు చేసినా మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. పార్టీలో చేరిన వారిలో సల్ల రాజు, నర్సింగ్, యాదగిరి, శ్రీను, నరేష్, మల్లయ్య, ఎల్లయ్య, వీరేష్, కుంచం అశోక్, రాజు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బీరెల్లి రాజ్యలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.