జనగామ : పాలకుర్తి నియోజకవర్గంలో చేరికల జోరు కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్(BRS)లో చేరుతున్నారు. తాజాగా తొర్రూరు మున్సిపాలిటీకి చెందిన 2 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మహేష్,12 వ వార్డు కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు కొండం దమయంతి, పాలకుర్తి మండలం, ముత్తారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు గ్యార పెద్ద యాకయ్య, గ్యార చిన్న యాకయ్య, గ్యార శోభన్ బాబు, తొర్రూరు మండలం, హరిపిరాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాశన్న గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు తొర్రూరు మండలం భోజ్యా (భీమా) తండాకి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు మాలోతు రమేష్, యూత్ నాయకులు సందీప్, ప్రతాప్, భాస్కర్, అశోక్, రవి, సాయి, మురళి, నవీన్ తదితరులు 50 మంది యువకులు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో పార్టీలో చేరారు.