నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం జిల్లాలోని కట్టంగూర్ మండలం గార్లబాయి గూడెం గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు నార్కట్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలన్నారు. పార్టీలో చేరిన వారిలో పర్వతం వెంకన్న, పరమేష్, లింగస్వామి, వానరాశి నర్సింహ, శిరీషాల అంజయ్య, పురణం కోటేష్, వంగూరి జానయ్య, గటిగోర్ల వెంకన్న, తెలు సైదులు, రమేష్ గట్టిగొర్ల ఐలయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాం, సర్పంచ్ బోడ సరిత యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు వంగురి సైదులు, మండల బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ గుండగోని రాములు, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.