జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి(Dhrmapuri) నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, తన అనుచరులతో కలిసి ధర్మపురిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్( Minister Koppula) సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ కే మా మద్దతు అంటు ప్రకటించారు. పార్టీ లో చేరిన వారికి మంత్రి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువా కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్తోనే అభివృవృద్ధి సాధ్యమన్నారు. పార్టీలో చేరిన వారిలో డీసీసీ యూత్ జనరల్ సెక్రటరీ ఆవుల వేణు, ఆవులు వెంకటేష్, ఆవుల ప్రతిష్, కనుకుట్ల సుజాత, శ్రీనివాస్ రెడ్డి, పాలమాకుల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సరికొండ మహంకర్, దామార పెల్లి మనోజ్, సతీష్, జిల్లా అనిల్, శేఖర్, నరష్ తదితరులు ఉన్నారు.