కరీంనగర్ : కరీంనగర్(Karimnagar)లో బీజేపీ(BJP)కి బిగ్‌షాక్ తగిలింది. బీజేపీ సిద్ధాంతాలు, బండి సంజయ్ వైఖరి నచ్చక కాశెట్టి శేఖర్ సహా 200 మంది యువకులు,300 మంది మహిళలు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) సమక్షంలో బీఆర్ఎస్లో చేఆరు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలక ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారన్నారు. పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.