కరీంనగర్ : ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. ఆదివారం మంత్రి గంగుల నివాసంలో జిల్లాలోని బొమ్మకల్, మల్కాపూర్, మొగ్దుంపూర్ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. పార్టీ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు తప్పవన్నారు. బీఆర్ఎస్ పాలనే తెలంగాణ రక్షణల అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, కాసారపు శ్రీనివాస్ గౌడ్, అంజిరెడ్డి గంగాధర లక్ష్మయ్య, గంగాధర చందు, ఒల్లాల మల్లేశం, తదితరులు ఉన్నారు.