గద్వాల అర్బన్, జూన్ 12 : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల ఎస్సై జగదీశ్‌ను ఎస్పీ కార్యాలయంలోని వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రాజోళి మండలం చిన్న ధన్వాడకు చెందిన ఒక దళిత కుటుంబం భూవివాదంపై ఎస్సై జగదీశ్‌కు ఫిర్యాదు చేయగా ఆ యన స్పందించలేదు. దీంతో సదరు బాధితులు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 10 గద్వాలకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఫిర్యాదుచేశారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యవహారంలోనూ ఎస్సై కంపెనీ యజమానులకు అనుకూలంగా వ్యవహరించి రైతులను బెదిరించడంతోపాటు అక్రమ కేసులు పె ట్టారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఆయా ఘటనలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఎస్పీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్సై జగదీశ్‌ను ఎస్పీ కార్యాలయం వీఆర్గా అటాచ్ చేశారు.