ఆదిలాబాద్, మే 1(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరిట ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ పట్టణంలో పర్యటించారు.
ఈ సందర్భంగా.. డీసీసీబీ బ్యాంకు వద్ద కొండిబా అనే వృద్ధుడిని కలిసి బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200, రూ.500 పింఛన్ ఇచ్చిందని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు రూ.2 వేల పింఛన్ వస్తున్నదని వృద్ధుడు తెలిపాడు. కాంగ్రెస్ పార్టీ రూ.4 వేల పింఛన్ ఇస్తానన్న హామీ ఇంతవరకు అమలు కాలేదని, వస్తుందనే నమ్మకం లేదని కొండిబా పేర్కొన్నాడు. తనకు రూ.2 వేల పింఛన్ ఇచ్చిన బీఆర్ఎస్కే ఓటు వేస్తానని హామీ ఇచ్చాడు.