హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): గని ప్రమాదాల్లో ప్రా ణాలు కోల్పోయిన వారి వారసులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో సింగరేణి కీలక నిర్ణయం తీసుకున్నది. కారుణ్య నియామకాల్లో భాగంగా డిగ్రీ అర్హత గల వారికి గ్రేడ్-3 క్లర్క్ ఉద్యోగాలిచ్చేందుకు సంస్థ యాజమాన్యం అంగీకరించింది. సింగరేణి సీఎండీ ఎన్ బలరాంనాయక్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. గుర్తింపు కార్మిక సం ఘంతో గతంలో జరిగిన 51వ నిర్మాణాత్మక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, తాజాగా ఆదేశాలిచ్చారు. గతంలో డిగ్రీ అర్హత గల వారికి జనరల్ అసిస్టెంట్‌గా మాత్రమే ఉద్యోగాలిచ్చేవారు. 2009లో సర్క్యులర్ ప్రకారం టెక్నికల్ అర్హతలు గల విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. తాజాగా డిగ్రీ అర్హతలు కూడా చేర్చి, గ్రేడ్-3 క్లర్క్ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. ఒక వేళ ఉద్యోగి కుటుంబంలో అర్హులైన టెక్నికల్ డిగ్రీ అర్హత గల వారసులు లేకపోతే సాధారణ డిగ్రీ ఉంటే గ్రేడ్-3 క్లర్క్ పోస్టు అభ్యర్థిత్వానికి పరిశీలిస్తారు.