విదేశీ వర్సిటీలతో జేఎన్టీయూ ఒప్పందాలు
విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు లభించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం విదేశీ వర్సిటీలతో పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకొంటున్నది.
- తాజాగా స్వీడన్ వర్సిటీతో అవగాహనా ఒప్పందం
- విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు లభించాలన్నదే లక్ష్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు లభించాలనే లక్ష్యంతో జేఎన్టీయూ హైదరాబాద్ విశ్వవిద్యాలయం విదేశీ వర్సిటీలతో పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) చేసుకొంటున్నది. ఇప్పటికే అనేక దేశాల వర్సిటీలతో ఎంవోయూలు కుదుర్చుకున్న జేఎన్టీయూ.. తాజాగా స్వీడెన్కు చెందిన బీటీహెచ్ వర్సిటీతో రెన్యువల్తోపాటు సరికొత్త ట్రెండింగ్ కోర్సులు/అంశాలపై కూడా అవగాహన చేసుకున్నది. గతంలోనే అమెరికా, థాయిలాండ్ దేశాల వర్సిటీలతో జేఎన్టీయూ అధికారులు ఒప్పందాలు చేసుకున్నారు. రిసెర్చ్, స్కిల్ డెవలప్మెంట్, ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లలో బీటెక్, ఎంటెక్/ఎమ్మెస్సీ ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల కోసం ఎంవోయూలు కుదుర్చుకున్నారు. యూజీ, పీజీ, పీహెచ్డీ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ (డాటా సైన్స్), డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ (డీడీఎంపీ) వంటి కోర్సులను ప్రోత్సహించడం, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఎంఈ కోర్సులు బోధించడానికి ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లపై కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ (బీఎస్ అండ్ ఎంఎస్), స్టూడెంట్ అండ్ స్టాఫ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ వంటి కోర్సులతోపాటు జాబ్ ఓరియంటెడ్, రిసెర్చ్ కార్యకలాపాలపైన విదేశీ వర్సిటీలతో ఒప్పందం చేసుకుంటున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

