హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : జపనీస్ సంస్థ ఎల్ఎస్ పార్ట్నర్స్ నగరానికి చెందిన కెరీర్ కన్సల్ట్‌తో జేఎన్టీయూలో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందంతో ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ రంగంలో జపాన్‌లో ప్లేస్మెంట్ పొందేందుకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ)పై ఇరు విద్యా సంస్థలు మంగళవారం ఎంవోయు చేసుకున్నాయి.
ప్రస్తు తం జపాన్‌లో వృద్ధాప్య సమస్య ఉన్నదని, దీంతో నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కే కిషన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, అకడమిక్ డైరెక్టర్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ ఎం ధనలక్ష్మి, జపనీస్ సంస్థ ప్రతినిధులు సయురి మట్సునో పాల్గొన్నారు.