JNTU | హైదరాబాద్ : ఫీజు రియింబర్స్మెంట్ నిధుల కోసం ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు చేపట్టిన బంద్ నేపథ్యంలో హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది. మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన బీ ఫార్మసీ ఫస్టియర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ కే వెంకటేశ్వర్ రావు ప్రకటించారు. ఇవాళ ఉదయం ప్రారంభం కావాల్సిన ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. తదుపరి ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తామన్నారు. రూ. 10 వేల కోట్ల ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు ఉండగా, ప్రస్తుతం రూ 5 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.