హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ అంతర్జాతీయ యూనివర్సిటీలతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదర్చుకుంటున్నది. తాజాగా రాయిట్లింగన్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ బీటెక్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాసెల్‌లో డబుల్ డిగ్రీ మాస్టర్ ప్రొగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
బీటెక్, బీటెక్(ఐడీపీ), ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏతోపాటు పలు పీహెచ్‌డీల్లో కూడా ఇతర దేశాలకు చెందిన పలు వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంటున్నది. జాబ్ కోర్సులుగా వీటిని అందుబాటులోకి తీసుకురాన్నారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ దరఖాస్తులు, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.