హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీ ల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. పోస్టుల భర్తీ కోసం రెండు నెలల క్రితం ప్రభుత్వం హడావుడి చేసింది. మార్గదర్శకాలతో జీవో విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల వల్ల తమ కు నష్టం జరుగుతుందని కాంట్రాక్ట్ అధ్యాపకులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. న్యాయం చేయాలంటూ 12 యూనివర్సిటీల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులంతా ఆం దోళనకు దిగారు.
13 రోజులకుపైగా అన్ని యూనివర్సిటీల్లో క్లాసులు బంద్ పెట్టి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పీజీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ జీవో వల్ల అన్యాయం జరుగుతుందన్న మరో వాదన బయటకు వచ్చింది. మార్గదర్శకాల్లో మార్పులు చేసి, పోస్టులను భర్తీ చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులతో పాటు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం ఆ జీవోను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్న ది. అయితే, నిరుద్యోగులకు అనుకూలంగా మార్పులు చేసి జీవోను మళ్లీ విడుదల చేస్తా రా? అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను సకాలంలో భర్తీ చేయకపోవడం వల్ల యూనివర్సిటీల ప్రమాణాలు పడి పోతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల వర్సిటీ విద్యా విధా నం కుంటుపడుతున్నదన్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,700 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.