హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గవర్నర్‌గా త్రిపురకు చెందిన జిష్ణుదేవ్‌వర్మ బుధవారం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్ వేదికగా రాష్ట్రానికి నాలుగవ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. జిష్ణుదేవ్‌వర్మతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నేతలు హాజరయ్యారు. జిష్ణుదేవ్ వర్మ 1957 ఆగస్టు 15న త్రిపురలోని రాజకుటుంబంలో జన్మించారు.
రామ జన్మభూమి ఉద్యమ సమయంలో ఆయన బీజేపీలో చేరారు. నాటినుంచి పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2018 నుంచి 2023 వరకు త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌గా సేవలందించారు. నిరుడు జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. జిష్టుదేవ్ వర్మ రచయిత కూడా. ‘వ్యూస్, రివ్యూస్ అండ్ మై పోయమ్స్’ అనే పుస్తకాన్ని రచించారు. ఇటీవలే దానిని ఆవిష్కరించారు.