మూడేండ్లలో కాళేశ్వరం కడితే.. రేవంత్ కనీసం రిపేర్ చేయించలేరా?
కేసీఆర్ మూడేండ్లలో కాళేశ్వరం పూర్తిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లయినా సీఎం రేవంత్‌రెడ్డి మరమ్మతులు చేయించలేదని బీఆర్ఎస్ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
- బీఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి ఫైర్
జగిత్యాల, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ మూడేండ్లలో కాళేశ్వరం పూర్తిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లయినా సీఎం రేవంత్‌రెడ్డి మరమ్మతులు చేయించలేదని బీఆర్ఎస్ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్లు ఎత్తిపోస్తే కేసీఆర్‌కు ఎకడ పేరు వస్తదోనని, రేవంత్ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాలలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆ యన మాట్లాడారు. సాగు, తాగునీరు, విద్య, వైద్యాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.
2014కు ముందు ఉమ్మడి రా ష్ట్రంలో 261 గురుకులాలు ఉంటే, వాటికి అదనంగా 652 గురుకులాలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. నేడు విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్ ఒక్క గురుకులాన్నీ మంజూరు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ మంజూరు చేసిన రెసిడెన్షియల్ సూళ్లకు పక్కా భవనాలు నిర్మించాల్సింది పోయి, వాటికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పేరు పెట్టి రూ.200 కోట్లతో భవనాలను ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. రేవంత్ నిర్లక్ష్యం వల్ల వెయ్యికిపైగా సర్కార్ పాఠశాలలు మూతపడ్డాయని చెప్పారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ సాగు, తాగునీరు, విద్య, వైద్యంపై దృష్టి సారించాలని సూచించారు.
‘ఓట్ బచావో-దేశ్‌బచావో’ ర్యాలీకి సమన్వయ కమిటీ
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో వచ్చేనెల 1న నిర్వహించనున్న ‘ఓట్ బచావో-దేశ్ బచావో’ ర్యాలీ కోసం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమించారు. కమిటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లురవి, బలరాంనాయక్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఉన్నారు. ర్యాలీకి తెలంగాణ నుంచి హాజరయ్యే నాయకులకు ప్రయాణం, వసతి, ఇతర సౌకర్యాలు తదితర ఏర్పాట్లను చూడటం ఈ కమిటీ బాధ్యత.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

