హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ పేపర్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. ఫలితాల్లో పేపర్-2ఏ (బీఆర్క్)లో 99.9796122 పర్సంటైల్‌తో సాకేత్ వేంపల్లి స్టేట్ టాపర్‌గా నిలిచాడు. ఇక పేపర్-2బీ ( బీ ప్లానింగ్)లో రాష్ట్ర విద్యార్థి మున్నూరునాయక్ అభయ్ కౌటిల్య 99.7042375 పర్సంటైల్‌తో స్టేట్ టాపర్‌గా నిలిచాడు. జనవరి 30న జాతీయంగా ఈ రెండు పరీక్షలు నిర్వహించారు.