హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : జేఈఈ గణితం పేపర్ ప్రశ్నలు విద్యార్థులను కాస్త తికమకపెట్టాయి. శుక్రవారం నిర్వహించిన గణితం పేపర్లో ప్రశ్నల నిడివి పొడవుగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. గురువారం గణితం పేపర్లో ఇచ్చినట్టుగానే ప్రశ్నలున్నట్టు శ్రీచైతన్య ఐఐటీ ఆలిండియా కోఆర్డినేటర్ ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు. మొదటిషిఫ్ట్లో ఫిజిక్స్ పేపర్లో ఎక్కువగా ఫార్ములా బేస్డ్ ప్రశ్నలిచ్చారు. ఇవి సుల భం నుంచి మధ్యస్తంగానే ఇచ్చారు. ఇక కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలిచ్చారు. ఇవి సులభంగానే ఉన్నా యి. గణితంలో వెక్టార్, త్రీడీ, సంభావ్యత సీక్వెన్స్ అండ్ సీరిస్, జ్యామెట్రి ఫిజిక్స్‌లో ఆధునిక భౌతికశాస్త్రం, గురుత్వాకర్షణ, సెమికండక్టర్ల నుంచి ప్రశ్నలిచ్చారు.
ఇక రెండోషిఫ్ట్లో ఎప్పుడూ కఠినంగా ఉండే కెమిస్ట్రీ అత్యంత సులభంగా ఇచ్చారు. ఇక గణితం ప్రశ్నలు మధ్యస్తంగా ఇవ్వగా, సుదీర్ఘ ప్రశ్నలు విద్యార్థులను ముప్పుతిప్పలుపెట్టాయి. ఫిజిక్స్ ప్రశ్నలు కూడా సులభంగా ఇవ్వగా, ఫార్ములాబేస్డ్ ప్రశ్నలే ఎక్కువగా ఇచ్చారు. కెమిస్ట్రీలో ఆల్కహాల్‌లు, ఈథర్ అండ్ ఫినాల్స్, అమైన్లు, ఆల్డిహైడ్లు, కీటోన్స్, బయోమాలిక్యూల్స్, ఆల్కైల్ హాలైడ్స్, కెమికల్ కైనటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, వంటి సబ్జెక్టుల నుంచి ప్రశ్నలిచ్చినట్లుగా నిపుణులు విశ్లేషించారు.