హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ వంటి కో ర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమై 9వ తేదీతో ముగుస్తాయి. 2,3,4,7,8 తేదీల్లో బీఈ, బీటెక్ అభ్యర్థులకు, 9న బీప్లానింగ్, బీఆర్క్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. ఆన్లైన్లో జరగనున్న ఈపరీక్షలకు 9 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఈనెల 4 వరకు పేపర్లవారీగా అడ్మిట్కార్డులను వెబ్సైట్లో విడుదల చేయనున్నది.