హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఇక నుంచి జేఈఈ అ డ్వాన్స్‌డ్ పరీక్షలను వరుసగా మూడేం డ్లు రాసుకోవచ్చు. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్‌ను రెండు నుంచి మూడుకు పెం చారు. 2025లో నిర్వహించే అడ్వాన్స్డ్ పరీక్షతో ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఇది వరకు ఒక విద్యార్థి వ రుసగా రెండేండ్లు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే వీలుండేది. ఇప్పుడు పరీక్షను మూడు సార్లు రాసుకునే అవకాశమిచ్చారు. జేఈఈ-2025 నిర్వహణ బాధ్యతలను ఐఐటీ కాన్పూర్‌కు అప్పగించారు.
టీచర్లకు తొలివేతనం అందేదెప్పుడు?
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఉద్యోగాల్లో చేరి న 10 వేల మందికిపైగా కొత్త టీచర్లకు వచ్చే నెలలోనూ తొలి వేతనం అంద డం అనుమానంగానే ఉంది. వీరికి ఇంతవరకూ ఎంప్లాయ్ ఐడీలు ఇవ్వలేదు. 33 జిల్లాల్లో కేవలం రెండుమూ డు జిల్లాలోనే కేటాయించారు. ఐడీలు వచ్చిన వారికి కూడా ప్రాన్ నంబర్లూ జనరేట్ కాలేదు. ఈ రెండు ఉంటేనే వేతనాల బిల్లులు చేస్తామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కొత్త టీచర్ల డేట్ ఆఫ్ జాయినింగ్ అక్టోబర్ 10, 16 అని విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చినా, రాష్ట్ర ఆర్థిక విభాగం నుంచి తమకు నమాచారం అందలేద ని అధికారులు చెబుతున్నారు. ఎంప్లా య్ ఐడీలను ఒక తేదీన.. శాలరీ లె క్కింపు చేసేది మరో తేదీ ఉండటంతో గందరగోళం నెలకొన్నది.