హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఐఐటీ కాన్పూర్ ఈ అడ్మిట్‌కార్డులను వెబ్సైట్లో పొందుపరిచింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను 18న జాతీయంగా నిర్వహించనున్నది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1, మధ్యా హ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2కు పరీక్షలు నిర్వహిస్తారు. 2.5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.