నేడు జేఈఈ అడ్వాన్స్డ్
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లోని బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆదివారం నిర్వహించనున్నారు. జాతీయంగా నిర్వహించే పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.
- 2 సెషన్లలో పరీక్షలు.. నిర్వహణకు ఐఐటీ పరిశీలకులు
హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లోని బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆదివారం నిర్వహించనున్నారు. జాతీయంగా నిర్వహించే పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష నిర్వ హణకు ఎగ్జామ్స్ సెంటర్లలో ఐఐటీ ప్రతినిధులను పరిశీలకులుగా ని యమించారు. వీరు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షకు అనుమతిస్తారు. నీట్ పేపర్ లీకేజీ క్రమంలో అడ్వాన్స్డ్ ఎగ్జామ్‌ను ఆన్లైన్లోనే నిర్వహిస్తు న్నా, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్‌ను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తున్నది.
రెండు పేపర్లు రాయాల్సిందే..
అడ్వాన్స్డ్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30గంటల నుంచి సాయంత్రం 5:30గంటల వరకు రెండో పేపర్‌కు పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్థులు రెండు పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఏదో ఒక పేపర్‌కు మాత్రమే హాజరైతే అభ్యర్థిత్వం రద్దవుతుంది. విద్యార్థులను ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆలస్యంగా వచ్చే విద్యార్థులను పరీక్షకు అనుమతించరు. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 1న విడుదలకానున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

