లక్ష్మణ్‌గౌడ్ మరణం సర్కార్ పాపమే
రైతు లక్ష్మణ్‌గౌడ్ మరణం ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ పాపమేనని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన లక్ష్మణ్‌గౌడ్ కరెంట్ సక్రమంగా రాక,
- కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలి
- బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తేతెలంగాణ) : రైతు లక్ష్మణ్‌గౌడ్ మరణం ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్ పాపమేనని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన లక్ష్మణ్‌గౌడ్ కరెంట్ సక్రమంగా రాక, సరిపడా సాగునీరందక తన పంట ఎండిపోవడంతో తీవ్ర మనోవేదనతో తనువు చాలించారని బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనకు ఉన్న ఎక్స్కవేటర్ విషయంలో కలెక్టర్ కేసులు నమోదు చేసి, చివరికి దాన్ని అమ్ముకునే విధంగా వేధించారని ఆరోపించారు.
వందల ఏండ్లుగా ఆ కుటుంబానికి ఉన్న భూమిని ఆన్లైన్ చేయకుండా, భూభారతి పేరు తో ఇబ్బందులకు గురిచేస్తూ కుటుంబాన్ని అవమానించారని తెలిపారు. బాధ్యుడైన కలెక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల త్యాగాల గురించి మంత్రి పొంగులేటి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నదని దుయ్యబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

