మేం నియమించలేదు.. జీతాలియ్యం!
12 నెలలుగా చాకిరీ చేయించుకున్న తర్వాత జీతాలు ఇచ్చేది లేదని చెప్పడంతో ఎస్సీ గురుకులంలోని దాదాపు 1,000 మంది పార్ట్‌టైమ్, గెస్ట్ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభు త్వ తీరుకు నిరసనగా బుధవారం సంక్షేమ భవన్‌ను ముట్టడించారు.
- గురుకులాల్లో పార్ట్‌టైమ్ టీచర్లకు సర్కార్ షాక్
- 12నెలలుగా వెట్టిచాకిరీ
- సంక్షేమభవన్‌ను ముట్టడించిన ఉద్యోగులు
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : 12 నెలలుగా చాకిరీ చేయించుకున్న తర్వాత జీతాలు ఇచ్చేది లేదని చెప్పడంతో ఎస్సీ గురుకులంలోని దాదాపు 1,000 మంది పార్ట్‌టైమ్, గెస్ట్ ఉద్యోగులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభు త్వ తీరుకు నిరసనగా బుధవారం సంక్షేమ భవన్‌ను ముట్టడించారు. అయినప్పటికీ అధికారులు తమకేం సంబంధం లేదని చేతులేత్తేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు పార్ట్‌టైమ్ ఉద్యోగులు మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఎస్సీ గురుకుల సొసైటీలోని పాఠశాలలు, కళాశాలల్లో పలు విభాగాల్లో దాదాపు 1,000 మంది పార్ట్‌టైమ్, గెస్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నామని వివరించారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్ నోటిఫికేషన్‌తోపాటు, డెమో, పరీక్షలు, మెరిట్ ఆధారంగా నియమించారని, అయినప్పటికీ దాదాపుగా 12నెలలుగా వేతనాలను చెల్లించడం లేదని తెలిపారు. సాంక్షన్ పోస్టులకు మాత్రమే జీతాలు వస్తాయని, నాన్ శాంక్షన్ పోస్టులకు వేతనాలు చెల్లించేది లేదని అధికారులు తెగేసి చెప్తున్నారని, 12నెలలుగా పనిచేయించుకుని ఇప్పుడు వేతనాలు ఇవ్వబోమంటే ఎలా అని ప్రశ్నించారు.
వేతనాలు చెల్లించాలి : జేఏసీ చైర్మన్
పార్ట్‌టైమ్ ఉద్యోగుల ధర్నాకు కాంగ్రెస్ బహిష్కృత నేత బక జడ్సన్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ పుల్లగుర్ల రాజిరెడ్డి, రాష్ట్ర నేతలు మద్దతు తెలిపారు. సొసైటీ ఉన్నతాధికారులను కలిసి సిబ్బంది సమస్యలను వివరించారు. తక్షణమే వేతనాలు చెల్లించాలని కోరారు. వెంటనే పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి వేతనాలు ఇప్పించాలని సొసైటీ జాయింట్ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

