మియాపూర్ మాజీ ఎస్‌హెచ్‌వోకు 4 వారాల జైలు
కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కోర్టు ధికరణకు పాల్పడిన మియాపూర్ మాజీ ఎస్‌హెచ్‌వో ఎం ప్రేమ్‌కుమార్‌పై హైకోర్టు కన్నెర్ర జేసింది. ఆయనకు 4 వారాల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కోర్టు ధికరణకు పాల్పడిన మియాపూర్ మాజీ ఎస్‌హెచ్‌వో ఎం ప్రేమ్‌కుమార్‌పై హైకోర్టు కన్నెర్ర జేసింది. ఆయనకు 4 వారాల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట పరిధిలోని మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో 700 చదరపు గజాల వివాదాస్పద స్థలానికి రక్షణ కల్పించాలని 2019లో సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
వాటిని అమలు చేయకపోవడంతో ఏ శేఖర్‌బాబు, మరో ఏడుగురు 2023లో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి.. అప్పట్లో మియాపూర్ ఎస్‌హెచ్‌వోగా పనిచేసిన ప్రేమ్‌కుమార్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్టు స్పష్టమవుతున్నదని పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

