ఫ్యూచర్‌సిటీపై ఆరోపణలు అవాస్తవం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఫ్యూచర్‌సిటీ’ అభివృద్ధి ప్రాజెక్టుపై పిటిషనర్ చేసిన ఆరోపణలన్నీ వాస్తవ విరుద్ధమని ఫ్యూచర్‌సిటీ డెవలప్ మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందు స్పష్టం చేసింది.
- నిర్మాణ అనుమతులు ఇవ్వలేదు
- కేవలం మాస్టర్‌ప్లాన్ కోసమే టెండర్
- ఫార్మాసిటీతో మాకు సంబంధం లేదు
- ఎన్జీటీలో ఎఫ్‌సీడీఏ కౌంటర్ దాఖలు
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘ఫ్యూచర్‌సిటీ’ అభివృద్ధి ప్రాజెక్టుపై పిటిషనర్ చేసిన ఆరోపణలన్నీ వాస్తవ విరుద్ధమని ఫ్యూచర్‌సిటీ డెవలప్ మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ముందు స్పష్టం చేసింది. 1975 నాటి తెలంగాణ పట్టణ ప్రాంతాల (అభివృద్ధి) చట్టంలోని సెక్షన్ 3-ఏ నిబంధనల ప్రకారం.. 2025 మార్చి 12న రాష్ట్ర ప్రభుత్వం జీవో 69 ద్వారా ఎఫ్‌సీడీఏను ప్రత్యేక ప్రాంత అభివృద్ధి సంస్థగా చట్టబద్ధంగా ఏర్పాటు చేసిందని అథారిటీ పేరొన్నది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 56 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 765.28 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది.
‘ఫోర్త్ సిటీ’ పేరిట పర్యావరణ అనుమతులు లేకుండా ప్రభుత్వం పనులు చేపడుతున్నదంటూ సామాజిక కార్యకర్త దొంతి నరసింహారెడ్డి ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదిగా ఉన్న ఎఫ్‌సీడీఏ సమగ్ర కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. పిటిషన్లో ప్రస్తావించిన ఆరోపణలకు సంబంధించి ఎఫ్‌సీడీఏ ఇప్పటివరకు ఎలాంటి లేఅవుట్, టౌన్షిప్ అభివృద్ధి, భవన నిర్మాణ అనుమతి లేదా ఇతర అభివృద్ధి అనుమతులను మంజూరు చేయలేదని ఆ అఫిడవిట్లో పేర్కొన్నది. పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన స్థాయి, స్వభావం కలిగిన ప్రాజెక్టులేవీ తమ ముందుకు రాలేదని, వీటికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు కూడా పరిశీలనలో లేవని తేల్చిచెప్పింది. ఎఫ్‌డీసీఏ జారీచేసిన టెండర్ కేవలం ఫ్యూచర్ సిటీ సమగ్ర విజన్ డాక్యుమెంట్, మాస్టర్‌ప్లాన్ రూపకల్పన కోసం అనుభవజ్ఞులైన కన్సల్టెంట్‌ను ఎంపిక చేయడానికేనని స్పష్టం చేసింది. ఇది మౌలిక సదుపాయాల కల్పన, టౌన్షిప్ అభివృద్ధి, నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ కాదని వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

