బీఆర్ఎస్ నాయకులపై కేసులు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నడిబొడ్డున కోర్టు చౌరస్తాలో బీఆర్ఎస్ పైలాన్ తొలగింపు ఘటన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. పైలాన్ తొలగింపును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
- పైలాన్ కూల్చివేతపై ఆందోళనలో పాల్గొన్నందుకు మాజీ ఎమ్మెల్యే చందర్‌తోపాటు మరికొందరిపై కేసులు
- తప్పుడు కేసులకు భయపడేది లేదు
- మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని ఫర్టిలైజర్‌సిటీ, నవంబర్ 4 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నడిబొడ్డున కోర్టు చౌరస్తాలో బీఆర్ఎస్ పైలాన్ తొలగింపు ఘటన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. పైలాన్ తొలగింపును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పైలాన్ తొలగింపును నిరసిస్తూ క్రేన్ డ్రైవర్‌ను అడ్డుకొని, ధర్నా నిర్వహించినందుకు కోరుకంటి చందర్, మాజీ కార్పొరేటర్ నారాయణదాస్ మారుతితోపాటు మరికొందరిపై బుధవారం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
క్రేన్ ఆపరేటర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన సతేందర్ సాహు క్రేన్‌తో పైలాన్ తొలగిస్తుండగా కోరుకంటి చందర్, మారుతి అడ్డుకున్నారని, ఆపరేటర్‌ను పిడి గుద్దులు గుద్దారని రమేశ్‌నగర్‌కు చెందిన క్రేన్ యజమాని సూర్య దేవర హర్షవర్ధన్ ఫిర్యాదు చేయడంతోపాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, ధర్నా చేసి పనులను అడ్డుకున్నారనే ఫిర్యాదు మేరకు కోరుకంటి చందర్, మారుతితోపాటు మరికొందరిపై 132, 292, 126(2), 315(2) ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద సీఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేశారు.
కేసుల నమోదుపై పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఆనవాళ్లను లేకుండా చేయాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. పైలాన్‌ను తొలగించవద్దని తాము సామరస్యంగా అడిగినా పట్టించుకోలేదని, అందుకే తాము అడ్డుకున్నామని చెప్పారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని, మున్ముందు ఇలా అప్రజాస్వామిక పనులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

