హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఏబీవీపీ తెలంగాణ 42వ రాష్ట్ర మహాసభల్లో రెండవసారి రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ నకల జానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా చింతకాయల ఝాన్సీ ఎన్నికయ్యారు. ఈ నెల 7 నుంచి 10వ తేదీల్లో 69వ జాతీయ మహాసభలు ఢిల్లీలో జరుగుతుండగా.. వాటిల్లో భాగంగా 42వ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన జానారెడ్డిది నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం కాగా.. కార్యదర్శిగా ఎన్నికైన ఝాన్సీది నల్గొండ జిల్లా అనుముల మండలం శ్రీనాథపురం. వీరిద్దరూ విద్యారంగ, నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్నారు.