 
                                                            నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో వంతెన నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం రూ.2.4 కోట్లు మంజూరు చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాన్ని పక్కన పెట్టింది. దీన్ని నిరసిస్తూ గురువారం వాగులోనే జలదీక్ష చేపట్టిన యువకుడు చంద్రయ్యయాదవ్
కొల్లాపూర్, అక్టోబర్ 30 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో గ్రామానికి చెందిన యువకుడు చంద్రయ్యయాదవ్ వం తెన నిర్మాణం చేపట్టాలని గురువారం ఉద యం 8 గంటలకు ప్రారంభించిన జలదీక్ష సాయంత్రం వరకు సాగింది. పశువుల వాగుపై వంతెన నిర్మాణానికి బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.2 కోట్ల 40లక్షలను మంజూరు చేయించి, శంకుస్థాపన చేశా రు.
ప్రభుత్వం మారడంతో వంతెన నిర్మాణ పనులను పక్కనపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చంద్రయ్యయాదవ్ జలదీక్ష చేపట్టారు. పది గంటలకు పైగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు లో యువకుడు జలదీక్ష చేసినా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో గ్రా మస్థులే జలదీక్షను విరమింపజేశారు.
 
                            