హైదరాబాద్, జూలై 28 : కేంద్ర మాజీ మంత్రి, దివంగత సూదిని జైపాల్ రెడ్డి నేటి తరానికి ఆదర్శనీయుడని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు మార్గ్ లోని జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి పుష్పాంజలి సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డి వివిధ హోదాల్లో పని చేసి ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత, సేవాతత్వం కలిగిన నేత జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొని, రాష్ట్ర సాధన కోసం పోరాడరన్నారు. అప్పటి నేతలకు ఆయనే మార్గ నిర్ధేశకులుగా ఉన్నట్లు చెప్పారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అనే పదానికి నిదర్శనం స్వర్గీయ జైపాల్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు.
Hyderabad : ఆదర్శనీయుడు జైపాల్ రెడ్డి : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి