హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాగృతి యూకే విభాగం.. అక్టోబర్ 2న ఇల్పొర్డ్ నగరంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నది. శుక్రవారం ఈ వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిషరించారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు చేనేత చీరలు అందించాలని నిర్ణయించిన తెలంగాణ జాగృతి యూకే విభాగాన్ని ఆమె అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు, టీఎస్ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్, తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు బల్మూరి సుమన్‌రావు, సాయి కృష్ణారెడ్డి, పత్తిరెడ్డి, ప్రశాంత్ పూస , శ్రావణి బల్మూరి, మానసరెడ్డి, సాగరిక పూస, రోహిత్‌రావు తదితరులు పాల్గొన్నారు.